గత డిసెంబర్లో కాంగ్రెస్ సరారు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల కరపత్రమని ఇప్పుడు ఇంకా స్పష్టంగా తేలిపోయింది. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులు రూ.7 లక్షల కోట్లకు చేరాయన్న రేవంత్ ప్రభుత్వ ప్రకటన వాస్తవదూరమని రుజువైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన అప్పు కేవలం రూ.3,22,499 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ రిపోర్టు పేర్కొంటున్నది.
– హరీశ్‌రావు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ అప్పుల కుప్ప అంటూ రాష్ట్ర పరపతిని, పరువును దిగజార్చారు. రాష్ట్ర పెద్దగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రం దివాలా అని ప్రచారం చేశారు. బీఆర్ఎస్పై బురద జల్లబోయి తానే బురదలో ఇరుక్కున్నారు.
-మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao | సిద్దిపేట, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం దివాలా తీసిందని అబద్ధపు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రిజర్వు బ్యాంకు నివేదిక చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. అబద్ధాల పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్ధాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నదని మండిపడ్డారు. ఆ అబద్ధాలతోనే బీఆర్ఎస్పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఆర్బీఐ నివేదికతో పదేండ్ల తెలంగాణ అభివృద్ధి, ఆర్థిక పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ మంత్రులు చేస్తున్నది దుష్ప్రచారం అని తేలిపోయిందని పేర్కొన్నారు.
తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం కాదు, దివ్యంగా వెలుగుతున్నదని ఆర్బీఐ తేల్చిచెప్పిందని స్పష్టంచేశారు. సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో హరీశ్‌రావు గురువారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో సంపదను సృష్టించామని, దాన్ని రెట్టింపు చేయడమెలాగో కేసీఆర్ యావత్తు దేశానికి చూపించారని అన్నారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ ప్రతి రంగాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారని చెప్పారు. ఈ విషయాన్ని ఆర్బీఐ విడుదల చేసిన ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ -2024’లోని గణాంకాలు కండ్లకు కట్టినట్టు వివరించాయని తెలిపారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో పెరిగిన జీఎస్డీపీ, తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగం, సాగు విస్తీర్ణం, వ్యవసాయం, అటవీ విస్తీర్ణం, మూలధన వ్యయం, ఉపాధి అవకాశాలు ఇలా అన్నింటా తెలంగాణ రికార్డు సృష్టించి, అభివృద్ధికి అర్థమేమిటో చూపించిందని అన్నారు.
కేసీఆర్ ఘనతకు, తెలంగాణ పదేండ్ల అభివృద్ధికి ఇంతకుమించిన తారాణం ఇంకేముంటుందని ప్రశ్నించారు. ఆర్బీఐ రిపోర్టుపై కాంగ్రెస్ నేతలు ఏమంటారు? అని ప్రశ్నించారు. సీఎం దివాలా వ్యాఖ్యలతో రాష్ర్టానికి పెట్టుబడులు ఆగిపోయాయని, ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని అన్నారు. రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశారని, పురోగమనంలో ఉన్న రాష్ట్రం నేడు తిరోగమనంలో పయనిస్తున్నదని వ్యాఖ్యానించారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఆస్తులు సృష్టించాం…సంపద పెంచాం..పేదలకు పంచామని హరీశ్‌రావు చెప్పారు. మా పాలన తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల ఆస్తులను సమకూర్చిన వాస్తవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే వెలుగు చూడనివ్వడం లేదని అన్నారు. కాళేశ్వరానికి రూ.94 వేల కోట్లతో లక్షల కోట్ల విలువైన ఆస్తులను సాధించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథకు రూ.28 వేల కోట్లు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సీం రూ.27,554 కోట్లు, సీతారామ ప్రాజెక్టు రూ.8056 కోట్లు, దేవాదుల ప్రాజెక్టు రూ. 6000 కోట్లు, సమ్మక సాగర్ రూ. 2000 కోట్లు, మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.4,000 కోట్లు ఖర్చు చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించామని వివరించారు.
తమ ప్రభుత్వ హాయంలోనే తుమ్మిళ్ల, భక్త రామదాసు ప్రాజెక్టులు పూర్తి కావచ్చాయని అన్నారు. రోడ్లు భవనాల శాఖ ద్వారా 8,200 కిలోమీటర్లు డబుల్‌లైన్, 321 కి.మీ ఫోర్‌లైన్, 382 బ్రిడ్జిలను బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని తెలిపారు. దేవాలయాలను కట్టడానికి రూ.2,800 కోట్లు, రైతుబంధుకు రూ.72,972 కోట్లు, రైతు బీమా రూ.6,800 కోట్లు, రైతు రుణమాఫీ రూ. 29 వేల కోట్లు, ఉచిత కరెంట్‌కు రూ.61వేల కోట్లు, గొర్రెల పంపిణీకి రూ.5 వేల కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.61 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రేవంత్‌రెడ్డి కూర్చుంటున్న డాక్టర్ సచివాలయం కట్టించింది వాస్తవం కాదా? అని అడిగారు.
పటిష్టమైన భద్రత కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ, ఒక కలెక్టరేట్, ఒక ఎస్పీ ఆఫీస్, వెయ్యికి పైగా గురుకులాలు నిర్మించామని చెప్పారు. 68 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న వరి ఉత్పత్తిని, 2 కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచినామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇంత అభివృద్ధి జరిగినా, వీరు తెలంగాణ దివాలా రాష్ట్రమని దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రంపై ఈ దుష్ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు వేలేటి రాదాకృష్ణ శర్మ, నాయకులు రాజనర్సు, సాయిరాం, సంపత్‌రెడ్డి, శ్రీనివాస్, తదితర నాయకులు ఉన్నారు.
కాంగ్రెస్ మంత్రులు రాష్ట్రం అప్పుల కుప్ప అని పదేపదే గోబెల్స్ ప్రచారం చేశారని, కానీ ఆర్బీఐ రిపోర్టుతో వారి అబద్ధాలు పటాపంచలయ్యాయని హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి గత ప్రభుత్వాలు వారసత్వంగా ఇచ్చిన అప్పు రూ.72,658 కోట్లు అని తెలిపారు. ఇవి కాకుండా రూ.18,265 రుణాలను గ్యారంటీల రూపంలో మనకు అప్పగించారని చెప్పారు. ఈ రెండూ కలిసి రూ.90,923 కోట్లు అని చెప్పారు. ‘కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో తీసుకున్నది రూ.15,118 కోట్లు. ఇవి కూడా కలిపితే మొత్తం రూ.1,06,041 కోట్లు. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం ఔట్‌స్టాండింగ్ రూ.3,89,673 కోట్లు, గ్యారెంటీల రూపంలో అప్పు రూ. 38,867 కోట్లు. రెండు కలిపితే రూ.4,28,540 కోట్లు.
వీటి నుంచి రూ.1,06,041 కోట్లు తీసేస్తే పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన అప్పు రూ.3,22,499 కోట్లు మాత్రమే. ఇది ఆర్బీఐ రిపోర్టు’ అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను దాచి తమపై విషప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ విషప్రచారం చేయడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉన్నదో ఆర్బీఐ కాంగ్రెస్ నేతల కండ్లు తెరిపించేలా గణాంకాలతో సహా వివరించిందని పేర్కొన్నారు.
2014-15: 4.3 లక్షల కోట్లు
2023-24: 15.01 లక్షల కోట్లు
2014-15: 9,470 మెగావాట్లు
2023-24: 19,519 మెగావాట్లు
106% పెరుగుదల
2014-15: రూ. 1,03,889
2023-24: రూ. 3,56,564
243% పెరుగుదల
2014-15: 11,583 కోట్లు
2023-24: 78,611 కోట్లు
578% పెరుగుదల
2014-15: 1,151 యూనిట్లు
2023-24: 2,398 యూనిట్లు
108% పెరుగుదల
2017-18 : 94
2023-24: 73
తగ్గుదల: 28.76%
2017-18: 65
2023-24: 35
తగ్గుదల 85.7%
2013-14: 1.55 కోట్ల ఎకరాలు
2022-23: 2.29 కోట్ల ఎకరాలు
47.74% పెరుగుదల
2013-14 : 91 లక్షల టన్నులు
2023-24 : 2 కోట్ల టన్నులు
119% పెరుగుదల
2014-15 : 78.18 లక్షల ఎకరాలు
2023-24 : 160 లక్షల ఎకరాలు
105% పెరుగుదల
2014: 35
2020 : 21
తగ్గుదల – 66.6%
2014-15 : రూ. 2,650 కోట్లు
2019-20 : రూ. 7,303 కోట్లు
175.5% పెరుగుదల
2014-15 : 92,215 కిలోమీటర్లు
2023-24 : 1,40,555 కిలోమీటర్లు
52.42% పెరుగుదల
2014-15: 5 లక్షల టన్నులు
2022-23: 10 లక్షల టన్నులు
100 % పెరుగుదల
2014-15 : 80,400 హెక్టార్లు
2022-23: 2,94,800 హెక్టార్లు
266% పెరుగుదల
విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల కరపత్రమని ఇప్పుడు ఇంకా స్పష్టంగా తేలిపోయింది. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులు రూ.7 లక్షల కోట్లకు చేరాయన్న రేవంత్ ప్రభుత్వ ప్రకటన వాస్తవదూరమని రుజువైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన అప్పు కేవలం రూ.3,22,499 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ రిపోర్టు పేర్కొంటున్నది.
– హరీశ్‌రావు