మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 4 : యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతోపాటు కళలను ప్రోత్సహించేందుకు ఈ నెల 9, 10వ తేదీల్లో మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలను నిర్వహించనున్నట్టు యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ ఉత్సవాలకు 33 జిల్లాల నుంచి సుమారు 1,500 మంది కళాకారులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నా రు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్‌లో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి మాట్లాడుతూ.. కళలు, ప్రాచీన సంప్రదాయ కళారూపాలు ఆయా ప్రాంతాల గొప్పతనాన్ని తెలియజేస్తామన్నారు. బీఆర్ఎస్ సర్కార్ సంస్కృతి, సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు.