హైదరాబాద్ : నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు లేఖలు రాసింది. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్ కోరారు. సీడబ్ల్యూసీ, ఎన్ఐహెచ్ సీఈలతో సాంకేతిక సలహా బృందం ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని, కేంద్రం చేసుకోని రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల కాంపోనెంట్‌ను తొలగించాలని, అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని కోరారు. పనుల ప్రక్రియ పూర్తి చేసేలా గోదావరి నదీయాజమాన్య బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని, కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు నిలిపి వేయాలని లేఖలో ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్ కేంద్రాన్ని కోరారు.