నల్లగొండ, మే 17 : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్‌రెడ్డి-శోభ దంపతుల కుమార్తె నవ్య (24) అమెరికాలోని లేక్కంట్రీ క్రౌన్ పాయింట్ దగ్గర శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. నవ్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఎమ్మెస్ పూర్తి చేసి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నది.
ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. నవ్య మృతదేహాన్ని వెంటనే స్వస్థలానికి తెప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.