హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): గోదావరి నదీ జలాల్లో ఏపీ చేస్తున్న దోపిడీని అడ్డుకునేందుకు తెలంగాణ సరార్ చేపట్టిన న్యాయపోరాటం ఆదిలోనే అభాసుపాలైంది. రేవంత్ సరార్ సర్వోన్నత న్యాయస్థానంలో మొదలుపెట్టిన పోరాటంలో అస్త్రసన్యాసం చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లో మెదిలినట్టుగానే తెలంగాణ ప్రభుత్వాధినేత తీరు ఉన్నదనే విమర్శలకు బలం చేకూరుస్తూ కేసును తెలంగాణ వెనుకకు తీసుకున్నది. ఒకదశలో సుప్రీం ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసేందుకు ఉత్తర్వులు జారీ చేయబోగా, ప్రభుత్వ న్యాయవాది వినతితో ఆ పిటిషన్ పరిషారమైనట్టుగా ఉత్తర్వులు జారీచేసింది. గోదావరి పై అనధికారికంగా చేపట్టిన నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు (పీఎన్ఎల్పీ)ని అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వెనుకకు తీసుకుంటున్నట్టు సోమవారం ప్రకటించింది.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి న్యాయనిపుణులను సంప్రదించి ఢిల్లీ వెళ్లి పర్యవేక్షించినా పోరాటం వీగిపోయింది. ఈ వివాదం గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల రాష్ట్రాలతో ముడిపడి ఉన్నందున సివిల్సూట్ దాఖలు చేసుకోవాలని కోర్టు సూచిస్తూ తెలంగాణ పిటిషన్ చెల్లదని ప్రకటించింది. ఏపీకి కేటాయించిన వాటాకు మించి అదనంగా 200 టీఎంసీలను నల్లమలసాగర్ పేరుతో తరలించుకుపోతున్నదని ఆరోపిస్తూ ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదమని పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పుపట్టింది. ఇది నదీ పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల జల హకులతో ముడిపడి ఉన్న వ్యవహారమని ఈ నాలుగు రాష్ట్రాల అభిప్రాయాల తర్వాతే ఉత్తర్వులకు వీలుంటుందని వెల్లడించింది. దీం తో గత్యంతరం లేక తెలంగాణ ప్ర భుత్వం పిటిషన్‌ను వెనుకకు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇం దుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చితో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.
ఏపీ జలదోపిడీని అడ్డుకునేలా మధ్యంతర స్టే ఉత్తర్వులు సాధించి తెలంగాణ ప్రజల జలహకులను కాపాడినట్టు చెప్పుకునేందుకు రాష్ట్రం చేసిన ప్రయత్నా లు బెడిసికొట్టాయి. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ స్టే ఆదేశాలు జారీ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు గత విచారణలోనే తోసిపుచ్చింది. జల కేటాయింపులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నీటిని చోరీ చేస్తున్నదంటూ తెలంగాణ చేసిన వాదన సివిల్ వివాదం కిందకు వస్తుందని చెప్పి, సుప్రీంకోర్టును ఎలా ఆశ్రయిస్తారని నిలదీసింది. వివాదంపై కేంద్ర జల్‌శక్తిశాఖ కమిటీని ఏర్పాటు చేసిందని, అదేం తేల్చుతుందో వేచి ఉండకపోతే ఎలాగని ప్రశ్నించింది.
రాష్ట్ర సర్కార్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోరారు. గోదావరి ట్రిబ్యునల్ ఉత్తర్వులకు విరుద్ధంగా వరద జలాల పేరుతో ఏపీ నీటిని వాడుకునే కుయుక్తులను అడ్డుకోవాలని కోరారు. సెంట్రల్ వాటర్ కమిషన్ గైడ్‌లైన్స్ 25ను ఏపీ ఉల్లంఘించిందని, సివిల్ సూట్ పరిధి పరిమితమని చెప్పారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు సివిల్సూట్లో పరీవాహక రాష్ర్టాలూ ఉంటాయని చెప్పింది. అప్పుడు ఏపీతో తెలంగాణకు ఉన్న జల వివాదంతోపాటు ఆ రాష్ట్రాల నష్టం ఏమిటో తేలుతుందని తెలిపింది. సింఘ్వీ వాదిస్తూ నల్లమలసాగర్ ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ కేంద్ర జలసంఘం, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరారు.
ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు పూర్తిచేసే వరకు వేచి ఉంటే తెలంగాణకు నష్టం వస్తుందని, సీడబ్ల్యూసీ నిర్మాణాలు ఆపాలని ఆదేశించినా అయినా జరిగాయని, ఎవరైతే నిర్మాణాలు ఆపాలని ఆదేశించారో అదే సీడబ్ల్యూసీ చైర్మన్ సారథ్యంలో కమిటీ ఏర్పాటైందని చెప్పారు. ఈ వాదనలను ప్రారంభం నుంచే కోర్టు అడ్డుకున్నది. సివిల్ సూట్ దాఖలు చేయకుండా పిటిషన్ వేసి ఉత్తర్వులను జారీ చేయాలని ఏ‘లా’ ప్రకారం కోరుతున్నారని నిలదీసింది.
సివిల్ సూట్లో జోక్యం చేసుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఎకడ ఉందో చెప్పాలని పేర్కొంది. మరోపక కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసిందని చెప్తున్నప్పుడు ఆ కమిటీ ఏం తేల్చుతుందో చూడకుండా స్టే కోరడం ఏమిటని ఆక్షేపించింది. స్టే జారీకి ఆసారం లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని, సివిల్ సూట్ దాఖలు చేస్తామని సింఘ్వీ కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేయబోగా సింఘ్వీ కల్పించుకుంటూ ఇది సున్నిత విషయమని, వ్యాజ్యాన్ని వాపస్ తీసుకుంటామని, పిటిషన్ డిస్మిస్కు బదులు పరిషారమైనట్టుగా ఆదేశాలు సవరించాలని కోరగా అందుకు ధర్మాసనం అనుమతిచ్చింది.