మంచిర్యాల, జూలై 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “మంచిర్యాల నియోజకవర్గంలో పండిన పంటలను కాంగ్రెస్ సర్కారు సకాలంలో కొనలేదు. అకాల వర్షాలకు పంట పాడై నష్టపోతుందనే భయంతో ధాన్యాన్ని కాపాడుకొనే ప్రయత్నం లో నలుగురు రైతులు మృతి చెందారు. రెండున్నర నెలలు పూర్తయినా.. ఇప్పటికీ కాంగ్రెస్ సర్కారు ఆ రైతు కుటుంబా లకు సాయం అందించ లేదు. ఎప్పటికైనా రైతులకు బీఆర్ ఎస్సే శ్రీరామరక్ష” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
మంచిర్యాలలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. జరిగింది ఒక విషాదం. ఇక్కడ రాజకీయ పరమైన హడావుడి లేదు. ఆర్భాటం లేదు. ఏ ఎన్నిక లేదు. కానీ.. ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. నలుగురు రైతులు చనిపోతే ఒక్క రైతుకే రూ.5 లక్షలు వచ్చింది. అది కూడా ఎక్కడికి రూ.5 లక్షలు.. కేసీఆర్ పెట్టిన రైతుబీమా నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు. మిగిలిన ముగ్గురికి ఐదు లక్షలు కాదు గదా ఐదు వేలు కాదు గదా ఐదు పైసలు కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదన్నారు.
అది కూడా కేసీఆర్ పెట్టిన రైతుబీమాతో వచ్చిన పైసలే తప్ప.. ఈ ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదన్నారు. రాష్ట్రంలో ఇంత దుర్మా ర్గమైన, ఇంత కిరాతకమైన ప్రభుత్వం ఉందా అని ప్రశ్నిం చారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మంగళవారం నిర్వ హించిన ‘రైతు సదస్సు’కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఏడాది మే 5వ తేదీన కొనుగోలు కేంద్రాల్లో పంటను కాపాడుకొనేందుకు వెళ్లి గోడ, షెడ్డు కూలి మృతి చెందిన నలుగురు రైతులు తనుగుల నాగరాజు, తనుగుల అభిరామ్, గుండారపు వెంకటేష్, నెల్కి లచ్చన్నలకు గతంలో ప్రకటించిన ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారాన్ని కేటీఆర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు కొ ప్పుల ఈశ్వర్, జోగు రామన్న, ప్రశాంత్‌రెడ్డిలతో కలిసి బాధి త రైతుల కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కల్లాల కు తెచ్చిన ధాన్యాన్ని 30 రోజులు, 60 రోజులు కొనేటోడు దిక్కు లేడన్నారు. ఈ దిక్కుదివానం లేని ప్రభుత్వంలో అన్నదాతకు దిక్కులేని పరిస్థితిలో పంటను కాపాడుకొనే ప్రయత్నంలో నలుగురు చనిపోతే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకత్వం మాజీ ఎమ్మెల్యే మా దివాకర్‌రావు, మా మాజీ మంత్రి జీవన్‌రెడ్డిలు ఎనిమిది గంటలు ధర్నా చేసినా.. దున్నపోతుమీద వాన పడినట్లు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్నారు. చివరికి ఏదో మొక్కుబడిగా ఒప్పుకున్నారని, చూస్తాం.. చేస్తామని చెప్పారే గానీ దాదాపు రెండున్నర నెలలు గడిచిపోయినా స్పందన లేదని, కనీసం మానవత్వమనే ఆలోచన లేదన్నారు.

తెలిసిన వెంటనే కేసీఆర్ ఒక్కో రైతుకు రూ.5 లక్షలు ఇయ్యమన్నరు..
మంచిర్యాలలో నలుగురు రైతులు చనిపోయాక, అర్ధాంతరం గా వారి జీవితాలు ముగిసిపోయాక.. ధర్నా చేసిన సర్కారు నుంచి స్పందన లేక నాకు మా నాయకులు దివాకర్‌రావు, జీవన్‌రెడ్డిలు ఫోన్ చేశారని.. పార్టీ తరఫు న మనమైనా ఏమైనా చెప్పాలని అడిగారన్నారు. రైతులు ఇబ్బంది ప డుతున్నారు. వారికి అండగా నిలబ డాలి అని కోరార న్నారు. మా నా యకులు చెప్పగానే కేసీఆర్‌ను అడిగా మని, వెంటనే ఆయన మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ విషాదానికి పార్టీ తరపున తప్పకుండా మనం అండగా నిలబడాలని, ఒక్కొక్క రైతుకు రూ.5 లక్ష లు ప్రకటించాలని చెప్పారన్నారు.
అందుకే నేను ఒకటే అంటున్నానని.. ఈ బట్టేబాజ్ ముఖ్యమంత్రి, ఈ దగాకోర్ కాంగ్రెస్.. వీళ్లను ఉరికించి ఉరికించి కొడితే తప్ప మంచిర్యాలలో రేపు మనకు మళ్లీ రైతుబంధు రాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. తెలంగాణలో మళ్లీ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, తెలంగాణలో మళ్లీ రైతన్న కళ్లల్లో ఆనందం చూడాలి అంటే, తెలంగాణలో ఏ రైతు చనిపోయినా ఏ రైతు కుటుంబానికి ఏమైనా.. ఒక పెద్దన్నలాగా కేసీఆర్ మళ్లీ తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మళ్లీ మంచి రోజులు రావన్నారు.

మంచిర్యాల ఎమ్మెల్యేకు ఏం తెలుసో.. రేవంత్‌రెడ్డికి అదే తెలుసు..
30 నెలల కాంగ్రెస్ పాలనలో గోస పడ్డామని, ఇక మిగిలింది 29 నెలలు మాత్రమే అని కేటీఆర్ అన్నారు. ఈ కాంగ్రెస్ సిని మా అయిపోయిందని ఇంటర్వెల్ దాకా చూసేసినమని, సిని మాలో ఏమీ లేదు, తిట్లు తప్ప, బూతులు తప్ప ఏమీ లేదు, వీళ్ల దగ్గర అయ్యేది ఏం లేదు. సెక్ండ్ హాఫ్ కూడా.. వీళ్లతోని ఏం కాదు అన్నారు. ఇవే తిట్లు, లేదంటే ఒక నాలుగు కేసులు తప్ప వీళ్లకు చేతనయ్యేది ఏం లేదని, మంచిర్యాల ఎమ్మెల్యేకు ఎైట్లెతే కేసులు పెట్టుడు తెలుసో, రేవంత్‌కు అదే తెలుసు అన్నా రు.
మంచిర్యాలలో మిమ్మల్ని ఎవరెవరైతే సతాయి స్తున్నారో, పేర్లు రాసి పెట్టుకోండి! ఏ ఒక్కరినీ కూడా వదిలిపెట్టే సమస్య లేదు! నేను కేసీఆర్‌లా మంచోడిని కాదు.. నేను అంత మం చోడిని కాదు. రేపు గ్యారెంటీ నేను చెప్తున్నా మీకు.. ఇంకొక్క 29 నెలల తర్వాత తిరిగి కేసీఆర్ ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయి తీరుతారు. ఆరు నూరైనా తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తోని మళ్లీ తెలంగాణ తెచ్చిన నాయకుడే ఈ రాష్ర్టానికి నాయ కత్వం వహిస్తాడు. ఆ రోజు.. ఈ రోజు ఎవరైతే తోకలూ పుతున్నారో అధికారులు, వాళ్లకు నేను చెప్తున్నా, ముఖ్యంగా పోలీసులు డ్యూటీ చేయండి. కానీ అతి చేయకండి! ఎవరెవరు అతి చేస్తున్నారో గుర్తుపెట్టు కుంటాం, నువ్వు రిటైర్ అయినా మిత్తితో సహా తిరిగిచ్చే బాధ్యత నాది! ఒకవేళ మేము రిటైర్ అయిపోతున్నాం.. లేదా మేము పారిపోతాం అంటే.. సప్త సముద్రాల అవతల దాక్కున్నా గుంజుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాది! అని కేటీఆర్ అన్నారు.
తిరగబడితే.. ఊళ్లలో తిరగలేరు..
తెలంగాణను తిరిగి రెచ్చగొడితే, ఉద్యమ సమయంలో ఎట్లయితే ఉడికిపోయిందో, ఈ కాంగ్రెస్‌ను, బీజేపీని తరిమి తరిమి కొట్టేదాకా మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో ఉడు కు నెత్తురుతో ఉన్న మా తమ్ముళ్లు, రక్తం సలసల మరుగుతున్న మా రైతులు తిరగబడి తే… ఒక్క నాయకుడు, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ ఊళ్లల్లో తిరగలేరని ఈ సంద ర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. ఇకనైనా మంచిర్యాల ఎమ్మెల్యే తన వరస మార్చు కోవాలి, పద్ధతి మార్చుకోవాలన్నారు. ‘ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టు! ఆరు గ్యారెం టీల గురించి మాట్లాడు! 420 హామీల గురించి చెప్పు!
ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అడుగుతున్నారు నిన్ను… ఏమాయె మీరు ఇచ్చిన హామీలు, ఏమాయె నువ్వు చెప్పిన 420 హామీలు? పోయి మీ సీఎంను పట్టుకో, ఈ పని చేయ్, ఈ పని చేయ్ అని ప్రజ ల కోసం మంచి చేయించే ప్రయత్నం చేయించు అంతేగానీ బీఆర్ఎస్ నాయ కులను క్షోభ పెట్టే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టం అని’ హెచ్చరించారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యద ర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జోగు రామన్న, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, సంజయ్, మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య, కోనప్ప, మనోహర్‌రెడ్డి, చందర్, నాయకులు జాన్సన్ నాయక్, రాంమోహన్‌రావు, విజిత్‌రావు, కౌశిక్‌హరి, నారదాసు లక్ష్మణ్‌రావు, నల్మాసు కాంతయ్య, టీబీజీకేఎస్ నాయకుడు రాజిరెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడి ఇంట్లో కేటీఆర్ భోజనం

లక్షెట్టిపేట, జూలై 21 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నిర్వహించిన ‘రైతు సదస్సు’కు హాజరైన కేటీఆర్, ఆపై రంగపేటలోని దళిత నేత, తెలంగాణ ఉద్యమ కారుడు చిప్పకుర్తి నారాయణ ఇంటికి వెళ్లి సహాపంక్తి భోజనం చేశారు. అనంతరం టీ సేవించారు. దళితబంధు లబ్ధిదారులతో మాట్లాడారు. దళితులకు న్యాయం చేయాలనే దళిత బంధు పథకం తెచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు రూ. 12 లక్షలు ఇస్తానని చెప్పి మోసం చేసిందన్నారు. అనంతరం వృద్ధులతో ముచ్చటపెట్టారు. పెన్షన్ వస్తుందా..? లేదా అని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల సుమన్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, జోగు రామన్న, ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఖానాపూర్ ఇన్చార్జి జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మస్ కాంతయ్య , మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్లు తిప్పని లింగన్న, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచులు వినోద, శనిగారపు వెంకటేవ్, సతీష్ రెడ్డి, తోటపల్లి మహేందర్, సిసింద్రీ, నవీన్, బొలిశెట్టి రవి, ఎండీ షఫీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తో అన్ని వర్గాలకు అన్యాయం

కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించక పోవడంతో అకాల వర్షానికి పంటను కాపాడుకోవడానికి కళ్లాల్లోకి వెళ్లిన రైతులు మృత్యువాత పడ్డారు. వారికి న్యాయం చేయాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఎనిమిది గంటలు ధర్నా చేశారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. విషయం తెలిసిన వెంటనే రైతు కుటుంబాలను ఆదుకునేందుకు కేటీఆర్ ముందుకువచ్చారు. కాంగ్రెస్ రైతులతో పాటు అన్ని వర్గాలను అన్ని విషయాల్లో మోసం చేస్తున్నది. రైతు భరోసా, రుణమాఫీ, యూరియా, విత్తనాలు, సాగునీరు, గిట్టుబాటుధర, పంటల కొనుగోళ్ల విషయంలో రైతులను మోసం చేసింది.
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు, నాలుగువేల పింఛను పేరుతో వృద్ధులు, ఆరువేల పింఛను పేరుతో దివ్యాంగులు, రూ. 2500 పేరుతో మహిళలు, సైకిళ్లు, స్కూటీల పేరుతో బాలికలను మోసగించింది. హైడ్రాపేరుతో ఇండ్లు కూల్చుకుంటూ రేవంత్ రాక్షసానందం పొందుతున్నాడు. కాంగ్రెస్ అన్యాయాలను బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఎండగట్టుతున్నది. సింగరేణిలో కూడా మెడికల్ బోర్డు పెట్టడం లేదు. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం.
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం

ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునే వెసులుబాటు కల్పించలేదు. వారి పంటలను కాపాడుకునే క్రమంలో ప్రమాదం బారిన పడి నలుగురు రైతులు మృతి చెందారు. ఈ ప్రభుత్వం వారి కుటుంబాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన కూడా చేయని ప్రభుత్వం ఇదే. కేసీఆర్ హయాంలో రైతుల కళ్లల్లో ఆనందం చూశామని, సంతోషాన్ని చూశాం. కానీ నేడు కాంగ్రెస్ రైతులను అరిగోస పెడుతున్నది. సాగునీరు, యూరియా, కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. నాడు పండుగలా విలసిల్లిన రైతాంగం నేడు కన్నీళ్లు పెడుతుంది. మళ్లీ మంచిరోజులు వస్తాయి. రైతులను కళ్లల్లో పెట్టి చూసుకునే మహానాయకుడు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.
అంతర్గాం-మంచిర్యాల బ్రిడ్జి నిర్మించి తీరుతాం

మంచిర్యాల టౌన్, జూలై 21 : బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అంతర్గాం-మంచిర్యాల మధ్యన గోదావరి నదిపై వంతెన నిర్మించి తీరుతాం. గతంలో కేసీఆర్ మంజూరు చేసిన ఈ వంతెనను ఇక్కడి ఎమ్మెల్యే రద్దు చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఈ వంతెనను బీఆర్ఎస్ రాగానే నిర్మిస్తాం. నా మీద కోపంతో మంచి పనులు అడ్డుకోవద్దు. ఇంకా మంచి పనులు చేసి ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి. ఆరుగాలం కష్టపడ్డ రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వం బాధ్యత. కల్లాల్లోని ధాన్యాన్ని కాపాడుకునేందుకు వెళ్లి, అకాల వర్షానికి గోడకూలి నలుగురు రైతులు మృతి చెందారు.
ఇందుకు సీఎం పూర్తి బాధ్యత వహించాలి. లక్షెట్టిపేట చౌరస్తాలో ఆరు గంటలు పాటు ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం రాకపోవడం దారుణం. రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతో కేటీఆర్ ఒక్కొక్కరికీ రూ. 5 లక్షలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రమంతా పచ్చగా ఉండేది. అన్ని ప్రాంతాలకు నీరందించారు. కాంగ్రెస్ కుట్రపూరితంగా మేడిగడ్డనుంచి నీటిని తీయడం లేదు. కేవలం కుంగిన రెండు గేట్లకు మరమ్మతులు చేస్తే సరిపోయేది. కానీ కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న ఆలోచనతో, కుట్రపూరితంగా, ఈర్ష్యా ద్వేషాలతో నీటిని కిందకు వదులుతున్నారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నేపల్లి నుంచి పంపింగ్ చేసుకున్నా రాష్ట్రంలో కరువు లేకుండా ఉంటుంది. కరువుకు పూర్తిగా రేవంత్‌రెడ్డే బాధ్యుడు. రైతాంగానికి సాగునీరు, కరెంటు ఇవ్వరు, మద్దతు ధర ఇవ్వరు. రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంది.
వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్

వ్యవసాయం దండుగ అన్న చోటనే వ్యవసాయం పండుగ అని నిరూపించిన మహానేత కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారు. రూ. 83 వేల కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తే రూ. లక్ష కోట్లు అవినీతి జరిగిందని అంటున్నారు. వారికి ఎలాంటి తెలివి ఉందో దీనిని బట్టే అర్థమవుతుంది. కాళేశ్వరం విషయంలో సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. కేసీఆర్‌లాంటి గొప్ప వ్యక్తిని విమర్శించడం రేవంత్‌రెడ్డికి తగదు. ఆయన భాష, యాస మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఎల్లంపల్లికి ఫౌండేషన్ వేసింది నేనే. అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రతిపాదన పెట్టిందే నేనే. కేసీఆర్ వచ్చాక ఈ ప్రాజెక్టు పూర్తయ్యింది. ఎల్లంపల్లికి రేవంత్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. లక్షెట్టిపేట మండలంలో నలుగురు రైతులు మృతి చెందితే కనీసం స్థానిక ఎమ్మెల్యే రాలేదు. కలెక్టర్ కూడా రాలేదు. నలుగురు రైతులు చనిపోతే కలెక్టర్ రాకపోవడం వెనుక ఎమ్మెల్యే ఉన్నాడు. జేసీ వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పి వెళ్లిపాయారు. ఇప్పటి వరకూ మృతి చెందిన రైతు కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు. పోలీస్, రెవెన్యూ అధికారుల అండతో స్థానిక ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నాడు. రూ. 500 కోట్లు బ్యాంకులకు అప్పులు కట్టారు. ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి.