Sabitha Indra Reddy | తెలంగాణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామానికి చెందిన బీజేపీ నేత గౌడిచర్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కార్తీక్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి సబితారెడ్డి, కార్తీక్‌రెడ్డి బీఆర్ఎస్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు బోనాలు, కోలాటాలు, డప్పుల దరువులు, బాణసంచా మోతలతో సబితారెడ్డికి ఘన స్వాగతం పలికారు. భారీ క్రేన్‌తో స్వర్గీయ ఇంద్రారెడ్డి వ్రిగహానికి భారీ పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య్రకమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. ఎగిరేది గులాబీ జెండాయేనని చెప్పారు. గత ప్రపభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి తప్పా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రేవంత్ సర్కార్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పడం లేదన్నారు. ప్రజలు ఇప్పటి వరకు మూడు సార్తు దరఖాస్తులు చేసుకున్నా ఎలాంటి ప్రపయోజనం పొందలేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
గ్రామాల్లో రుణ మాఫీ ఇంకా జరుగలేదని కేసీఆర్ హయాంలో అటు చినుకులు పడితే ఇటు రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నాడు కేసీఆర్ ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం ద్వారా నేడు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు అందుతున్నదన్నారు. 24 గంటల విద్యుత్, రోడ్లు, గురుకులాలు, పాఠశాల భవనాలు, సమీకృల కలెక్టర్ భవనాలు నిర్మించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేలా ప్రపతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.