Vande Mataram | ఇకపై స్కూళ్లలో వందేమాతరం తప్పనిసరి.. జగనణమన కంటే ముందే పాడాలి.. కేంద్రం ఆదేశాలు
Vande Mataram : జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించే విషయంలో కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించాలని అని ఆదేశించింది.
Vande Mataram : జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించే విషయంలో కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించాలని అని ఆదేశించింది. జాతీయ గీతం ‘జనగణమన’ పాడటానికి ముందు వందేమాతరం కూడా పాడాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఉదయం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం వందేమాతరం ఆలపించేటప్పుడు అందరూ తప్పనిసరిగా నిలబడాలి.
గేయంలోని ఆరు చరణాల్ని ఆలపించాల్సిందే. వీటిలో కాంగ్రెస్ 1937లో తొలగించిన నాలుగు చరణాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఆలపించాలి. గతంలో నెహ్రూ ఆధ్వర్యంలో సెక్యులర్ అంశాలను సాకుగా చూపి, ముస్లిం లీగ్ అభ్యంతరాల మేరకు గేయంలోని నాలుగు చరణాలను తొలగించారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం వాటిని కూడా తిరిగి చేర్చింది. ఈ అంశంపై గత ఏడాది కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం నడిచింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సినిమా హాళ్లలో వందేమాతరం ప్లే చేయాల్సిన అవసరం లేదు. అలాగే థియేటర్లలో లేదా న్యూస్ రీల్స్‌లో ఈ గేయం ప్లే అవుతుంటే నిలబడాల్సిన అవసరం లేదు. ఇలాంటి చోట్ల ఎక్కువ మంది నిలబడటం వల్ల కార్యక్రమానికి ఆటంకం కలగడం, అలాగే శాంతి భద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకుని తాజా ఆదేశాలిచ్చింది.
‘వందేమాతరం’ ఆలపించడానికి మూడు నిమిషాల 10 సెకండ్ల సమయం పడుతుందని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు అయినటువంటి రాష్ట్ర వేడుకలు, పౌర సన్మానాలు, రాష్ట్రపతి పర్యటన, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, మంత్రులు పాల్గొనే వేడుకలు, జాతీయ పతాకావిష్కరణ వంటి కార్యక్రమాల సందర్భంగా ఇకపై వందేమాతరం ఆలపించాలి. ఇప్పటికే పద్మ వంటి కేంద్ర అవార్డులు ప్రదానం చేసే వేడుకల్లో ఈ గేయాన్ని ఆలపిస్తున్నారు. ఈ నిబంధనలు అతిక్రమించి జాతీయ గేయాన్ని అవమానిస్తే వారికి గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ‘వందేమాతరం’ గేయాన్ని 1875లో బంకించంద్ర ఛటర్జీ రచించారు. తర్వాత దీన్ని ఆయనే తన ఆనంద్ మఠ్ అనే నవలలో భాగం చేశారు. ఈ గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే తాజా ఆదేశాలిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Gana
- Jana
- Mana
- National Anthem
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

