వరంగల్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ఆవిర్భావ వేడుక ల సందర్భంగా గురువారం హనుమకొండలో తెలంగాణ వికాస సమితి కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. అశోకా కాన్ఫరెన్స్ హాల్ (అనిశెట్టి రజిత ప్రాంగణం)లో నిర్వహించే ఈ కవి సమ్మేళనానికి ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి ముఖ్య అతిథిగా, ఆత్మీయ అతిథిగా ఎ మ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరుకానున్నారని తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వనపట్ల సుబ్బ య్య, మల్లావఝల విజయ్, మాలోత్ భిక్షపతినాయక్, నిమ్మల శ్రీనివాస్ బుధవారం తెలిపారు.
సమ్మేళనంలో ప్రముఖ క టవులు వీఆర్ విద్యార్థి, రామా చంద్రమౌళి, వఝల శివకుమార్, నెల్లుట్ల ర మాదేవి, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వేముగంటి మురళీకృష్ణ, ఎన్వీఎన్ చారి, బిల్లా మహేందర్, తైదల అంజయ్య, బండారి రాజ్‌కుమార్, పెద్ది వెంకటయ్య, శంకర్రావు శంకేసి, సిరాజుద్దీన్, దేవులపల్లి వాణీదేవి, వల్సపైడి, రామా రత్నమాల, బాలబోయిన రమాదేవి, కోడం కుమారస్వామి, శనిగరపు రాజ్‌మోహన్, షేక్ హాజీ నూరానీ, కార్తీక రాజు, కుంజ కల్యాణి, నాగవెల్లి జితేందర్ సామ్రాట్ తదితరులు తమ కవితాగానం వినిపించనున్నారు.