హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతోపాటు విజయ డెయిరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార భరోసా కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు విజయడెయిరీ నుంచి పాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సాధ్యాసాధ్యాలపై ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.