హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహమ్మద్ షఫీయుల్లా సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కోసం సౌదీ అరేబియా వెళ్లడం ఎందుకు? అని వ్యాఖ్యానించారు. ప్రమాదంలో చనిపోయిన వా రిని చూసేందుకు ఇద్దరిని సౌదీకి పంపాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం హజ్ హౌజ్‌లో అధికారులతో చర్చించేందుకు మృతుల కుటుంబసభ్యులు వచ్చారు. వారితో మాట్లాడుతుండగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అగ్గిరాజేసింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు.
సౌదీ మృతుల కుటుంబాలకు పరామర్శ ; కుటుంబసభ్యులను ఓదార్చిన మహమూద్ అలీ, దత్తాత్రేయ
ముషీరాబాద్, నవంబర్ 18: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతిచెందిన నజీరుద్దీన్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం పరామర్శించారు. మృతదేహాలను ఇండియాకు తెప్పించేందుకు బీఆర్ఎస్ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, సయ్యద్ అస్లాం తదితరులు పాల్గొన్నారు. కాగా, రాంనగర్ సెయింట్ పాయిస్ హైస్కూల్‌కు చెం దిన ముగ్గురు విద్యార్థినులు ఈ ప్రమాదంలో మృత్యువాత పడగా, సంతాపంగా మంగళవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు.