నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న కనకయ్యను ఉద్యోగం నుంచి తొలగించాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు పాలకమండలి ఆమోదముద్ర కూడా వేసింది.
ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయన స్థానంలో సీనియారిటీ ప్రకారం తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా యాదగిరిని ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించింది.