హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫలితాల విడుదల నేపథ్యంలో డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియను ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. ఈ క్రమంలో ఈనెల 13న సోమవారం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్ట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
2026-27 విద్యా సంవత్సరంలో ప్రవే శాల నోటిఫికేషన్ను సోమవారం ఉద యం 11:30గంటలకు విడుదల చేస్తామని పేర్కొన్నారు. మూడు విడుతల్లో సీట్లను భర్తీ చేస్తామని వెల్లడించారు. 15 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతాయని, వారం తర్వాత నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయని ఆయన తెలిపారు.