రహస్య దానం
అదొక రాత్రి వేళ. ఆ గ్రామంలోని ఒక దైవభక్తుడు అల్లాహ్ సంతృప్తి కోసం ఎవరికీ తెలియకుండా రహస్యంగా దానం చేయాలనుకున్నాడు. చేతిలో కొంత సొమ్ము పట్టుకుని వీధిలోకి వెళ్లాడు. చీకట్లో ఒక వ్యక్తి కనిపిస్తే, పేదవాడేమో అనుకుని ఆ డబ్బును అతని చేతిలో పెట్టి సంతోషంగా ఇంటికి తిరిగొచ్చాడు.
- ఇస్లాం బోధ
అదొక రాత్రి వేళ. ఆ గ్రామంలోని ఒక దైవభక్తుడు అల్లాహ్ సంతృప్తి కోసం ఎవరికీ తెలియకుండా రహస్యంగా దానం చేయాలనుకున్నాడు. చేతిలో కొంత సొమ్ము పట్టుకుని వీధిలోకి వెళ్లాడు. చీకట్లో ఒక వ్యక్తి కనిపిస్తే, పేదవాడేమో అనుకుని ఆ డబ్బును అతని చేతిలో పెట్టి సంతోషంగా ఇంటికి తిరిగొచ్చాడు. తీరా మరుసటి రోజు ఉదయం చూస్తే… ఊరంతా ఒకటే ప్రచారం! ‘అబ్బో! రాత్రి ఎవరో మహానుభావుడు ఊళ్లోని ఒక పెద్ద దొంగకు దానం చేశాడట!’ అని ప్రజలు నవ్వుకోసాగారు. దాత మనసు విరిగిపోయింది. ‘అయ్యో దేవుడా! నా దానం ఒక దొంగ పాలైందే’ అని మదనపడ్డాడు. ఎలాగైనా ఒక మంచి పేదవాడికి దానం చేయాలని మరుసటి రాత్రి మళ్లీ బయలుదేరాడు. ఈసారి ఒక మహిళ కనిపిస్తే ఆమె చేతిలో డబ్బు పెట్టాడు. మరుసటి రోజు ఉదయం మళ్లీ అదే వార్త! ‘నిన్న రాత్రి ఎవరో ఒక వ్యభిచారిణికి దానం ఇచ్చారట!’ అని జనాలు చెప్పుకోసాగారు.
దాతకు ఏం చేయాలో పాలుపోలేదు. మూడో రాత్రి ‘ఈసారి ఎలాగైనా సరైన వ్యక్తికే ఇవ్వాలి’ అని గట్టిగా నిశ్చయించుకుని బయటికెళ్లాడు. మరో వ్యక్తికి దానం ఇచ్చి వచ్చాడు. తీరా ఉదయమయ్యే సరికి అది ఊళ్లోనే పెద్ద శ్రీమంతుడికి చేరిందని తెలిసింది! మూడు రోజులు… మూడు పొరపాట్లు! ఒక దొంగ, ఒక చెడు తిరుగుళ్ల మహిళ, ఒక కోటీశ్వరుడు! ‘ఓ అల్లాహ్! నా దానాలన్నీ అర్హత లేనివాళ్ల పాలయ్యాయే’ అని ఆ భక్తుడు తీవ్రమైన ఆవేదనలో మునిగిపోయాడు. ఆవేదనతో నిద్రపోయిన ఆ భక్తుడికి ఆ రాత్రి ఒక పవిత్రమైన స్వప్నం (కల) వచ్చింది. అందులో ఒక దివ్యమైన సందేశం వినబడింది: ‘బాధపడకు! నీ నిష్కల్మషమైన ఉద్దేశాన్ని (నియ్యత్) చూసి అల్లాహ్ నీ మూడు దానాలనూ స్వీకరించాడు! నీ కంటికి అవి పొరపాట్లుగా కనిపించవచ్చు… కానీ ఆ దేవుడి ప్రణాళిక వేరు.
- ఆ దొంగ… ‘నాకు కష్టపడకుండానే సొమ్ము లభించింది కదా’ అని దొంగతనాలు మానవచ్చు.
- ఆ మహిళ… ఆ డబ్బుతో తన అవసరాలు తీర్చుకుని, చెడు మార్గాన్ని వదిలేసి మంచిదానిగా మారవచ్చు.
- ఆ ధనవంతుడు… ‘నన్నే పేదవాడనుకుని ఎవరో రహస్యంగా దానం చేశారే’ అని సిగ్గుపడి, తన ఆస్తి నుంచి పేదలకు దానధర్మాలు చేయడం మొదలుపెట్టవచ్చు!
- ఈ సందేశం విన్న ఆ భక్తుడు అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు.
..?ముహమ్మద్ ముజాహిద్
96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

