నాగర్‌కర్నూల్, జూలై 26 : విశ్వంలో సృష్టి అ మ్మ అని అమ్మకు ప్రత్యామ్నాయం లేదని, అమ్మనే ఒక చరిత్ర అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్ నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రచించిన ‘పసరంటిన కొడవలి’ పు స్తకాన్ని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కోయీ కోటేశ్వర్రావు ఆవిష్కరించారు. ఈసభకు నెలపొడుపు సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి వహీద్‌ఖాన్ అధ్యక్షత వహించా రు. సభలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ విశ్వంలో సృష్టికి మించింది ఏదీలేదని, అదే అమ్మని అమ్మపై తనకున్న అప్యాయతలు, జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
అమ్మల జీవిత చరిత్రని తల్లుల శ్రామిక బహుజన తత్వాన్ని ఉత్పత్తి శక్తుల అమ్మలను కొనియాడుతూ వనపట్ల సుబ్బయ్య ర చించిన పసరంటిన కొడవలి అక్షరాల రూపంలో తీర్చిదిద్దడాన్ని ప్రశంసించారు. యువకవులు వనపట్ల సుబ్బయ్య కవిత్వంలోని ఆంశాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజశ్రేయస్సుకు పాటుపడాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మా ట్లాడుతూ జీవితంలో తన పేదరికాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా ఎదగాలని గుర్తు చేస్తూ అమ్మ ప్రాధాన్యత, విశిష్టత, ప్రేమ, త్యాగాన్ని వివరించారు. అ మ్మపై మనం వ్యవహరించాల్సిన తీరును ఏమిటనే ది మనమేమి కోల్పోతున్నామని ఈ సభ ద్వారా తెలుసుకొన్నానన్నారు. నేటి కాలంలో తల్లిదండ్రులను ఆశ్రమాలకు తరలిస్తున్న నేపథ్యంలో ఈ అమ్మ పుస్తకం ద్వారా అయినా చైతన్యం వస్తుందని అభిప్రాయపడ్డారు.
ప్రొఫెసర్ కోయీ కోటేశ్వర్‌రా వు మాట్లాడుతూ పసరంటిన కొడవలి పుస్తకాన్ని పరిచయం చేస్తూ అమ్మ వస్తుత్పత్తి భాగంలో ప్ర ముఖ పాత్ర వహిస్తుందని, తమ పిల్లలపై సమాజంపై సరైన వైఖరిని తీర్చిదిద్దే క్రమంలో అగ్రభాగాన అమ్మ నిలుస్తుందంటూ ఈ సందర్భంగా తన తల్లిని తలుచుకుంటూ తన ఆత్మీయుల తల్లులను కూడా కవిత్వీకరించడాన్ని కొనియాడారు. అనంతరం ముక్త తెలంగాణ మహిళా అధ్యయన వేదిక అధ్యక్షురాలు కొల్లాపురం విమల మాట్లాడారు. కార్యక్రమంలో వనపట్ల గ్రామ సర్పంచ్ వాసుదేవుడు, కోట్ల నిరంజన్‌రెడ్డి, కొండకింది మన్యపురెడ్డి, కవులు తగుళ్ల గోపాల్, ఎదిరేపల్లి కాశన్న, గుడిపల్లి నిరంజన్, కల్వకోలు మద్దిలేటి, ముచ్చర్ల దినకర్, వెంకట్పవార్, ఖాజ, యోగానందం, గౌస్‌పాషా, దేవదానం, పలుస శంకర్‌గౌడ్, వెంకట్పవార్, నీర టి బాలీశ్వర్, దేవరపాగ కృష్ణయ్య, రాజేష్, వహీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.