హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శుక్ర, శనివారాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నిరుడు ఆగస్టులో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు.
హైదరాబాద్లోని చైతన్యపురి సోషల్ వెల్ఫేర్ మహిళా గురుకుల లా కాలేజీలో 1:2 పద్ధతిలో వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఫలితాల నోటిఫికేషన్లో హాల్టిక్కెట్లు ఉన్న వారు మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ రావాలని పేర్కొన్నారు. www.treirb.telangana. gov.inలో ఉన్న ఒరిజినల్ పత్రాల రెండు సెట్ల జిరాక్స్లు, సెల్ఫ్ అటెస్టేషన్తో సమయానికి హాజరుకావాలని కోరారు.