హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : అవయవ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నిరుడు దేశవ్యాప్తంగా ప్రతి 10లక్షల మంది జనాభాకు సగటున 0.8, తెలంగాణలో 4.88 అవయవ దానాలు జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణకు నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (ఎన్‌వోటీటీవో) అవార్డు ప్రకటించింది.
శనివారం ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవదాన దినోత్సవాల్లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ‘జీవన్‌దాన్’ ప్రతినిధులకు అవార్డు ప్రదానం చేశారు. కాగా, అవయవ దానాల్లో తెలంగాణకు అవార్డు రావడంపై మంత్రి రాజనర్సింహ హర్షం వ్యక్తంచేశారు.