100 శాతంతో అగ్రభాగాన తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 23 : దేశంలోనే ఇంటింటికి శుద్ధిచేసిన నల్లా నీటిని అందించటంలో చిట్టచివరన ఉత్తరప్రదేశ్ ఉన్నదని రాష్ట్ర స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. 100 శాతంతో తెలంగాణ అగ్రభాగాన ఉన్నదని, మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలో 100 శాతం ఇండ్లకు తాగు నీటిని అందిస్తున్నదని వెల్లడించింది. రాష్ట్రంలో 54 లక్షల ఇండ్లకు తాగునీటిని అందిస్తున్నట్టు వివరించింది. యూపీలోలో 13 శాతం ఇండ్లకే తాగునీటిని అందిస్తున్నారు. అక్కడ ఐదేండ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నది.