హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ)/సిటీబ్యూరో : తెలంగాణ టుడే సీనియర్ జర్నలిస్ట్ అనిల్‌కుమార్ (55)గుండెపోటుతో మరణించారు. ఆయన 2022 నుంచి తెలంగాణ టుడే ఆంగ్ల దినపత్రికలో పనిచేస్తున్నారు. 30 ఏండ్లుగా జర్నలిజం వృత్తిలో ఉన్న ఆయన 1994లో న్యూస్‌లైన్ రిపోర్టర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, డెయిలీ హిందీ మిలాప్, టీఎన్టీఈ, స్వతంత్రవార్త పత్రికల్లో పనిచేశారు. కుటుంబంతో కలిసి కర్నాటకకు విహార యాత్రకు వెళ్లారు. గోర్ణలోని మురుడేశ్వర ఆలయంలో ఉండగా గుండెపోటు వచ్చింది. దవాఖానకు తరలించగా చికిత్స పొం దుతూ మరణించారు.
ప్రముఖుల సంతాపం..
అనిల్‌కుమార్ మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూ తి తెలిపారు. అనిల్ ఆత్మకు శాంతి చే కూరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రార్థించారు. ఆయన కుటుంబానికి సా నుభూతి తెలిపారు. జర్నలిజం రంగానికి అనిల్‌కుమార్ విలువైన సేవలు అందించారని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. అనిల్‌కుమార్ మృతిపై సీఎం రేవంత్,మంత్రులు పొం గులేటి, సీతక్క సంతాపం తెలిపారు.