Rain Update | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఈ నెల 27న పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిం ది. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ములు గు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఆ యా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూ చించింది. అటు ఏపీలోనూ రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశముందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. వాయుగుండం తీవ్రవాయుగుండంగా లేదా తుఫాన్‌గా బలపడవచ్చని చెప్పారు. కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నదని తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో అత్యధికంగా 12.51 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్టు పేర్కొన్నది.