హైదరాబాద్, మే31 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో 2 వేల కోట్లను అప్పుగా తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆర్బీఐకి ఇండెంట్‌ను సమర్పించింది. దీనిపై ఈ నెల 4న ఆర్బీఐ ఆక్షన్ నిర్వహించనున్నది.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లోనే రూ.16 వేల కోట్లను అప్పుగా తీసుకోవాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రూ.10 వేల కోట్లను ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకున్నది. తాజాగా మరో రెండు వేల కోట్లు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.27 వేల కోట్లు అప్పుగా తీసుకున్నది.