రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండి.. రైతులకు అధికారుల సూచన
ప్రభుత్వం వానకాలం (ఖరీఫ్) రైతు భరోసా నిధులను ఈనెల 30 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించిందని, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్,జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం వానకాలం (ఖరీఫ్) రైతు భరోసా నిధులను ఈనెల 30 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించిందని, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈనెల 15నాటికి కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులు తమ దరఖాస్తులను జూలై 7వరకు సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. రైతులు తమ పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కాపీలతో ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
సాయికృష్ణ లాకప్‌డెత్‌పై ఎన్‌హెచ్చార్సీ ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏపీ పోలీసుల అధికార దుర్వినియోగంపై మండిపడింది. లాకప్ డెత్ అంశంపై తెలంగాణకు చెందిన మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం బాధితుడి తల్లి గాదె విజయలక్ష్మికి తక్షణమే భద్రత కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. వారం రోజుల్లో సమగ్ర యాక్షన్ రిపోర్టును సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

