హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)గా సెలెక్ట్ అయిన వారికి 26 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్టు సంస్థ కార్యదర్శి రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
26న టీజీటీ ఇంగ్లిష్, 27న టీజీటీ సంస్కృతం, టీజీటీ గణితం, 28న టీజీటీ సైన్స్, సోషల్, హిందీ, 29న టీజీటీ తెలుగు అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తామని తెలిపారు. నాంపల్లి గగన్‌విహార్‌లోని సంస్థ కార్యాలయంలో వెరిఫికేషన్‌ను నిర్వహిస్తామని తెలిపారు.