TG TET | తెలంగాణ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (TET) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. జనవరిలో 1,35,802 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. టెట్లో 31.21శాతం మంది అర్హత సాధించినట్లుగా పాఠశాల విద్యాశాఖ తెలిపింది. టెట్లో 42,384 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు పేర్కొంది. 31.21 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లుగా చెప్పింది.