హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు తొలిరోజు 73 శాతం అభ్యర్థులు హాజరైనట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు.
ఉదయం 49 సెంటర్లలో పరీక్ష నిర్వహించగా 12,815 అభ్యర్థులకు 9,259(72.25 శాతం) మంది హాజరవగా, 3,556 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 52 సెంటర్లలో నిర్వహించగా 12,734 మందికి 9,637(75.68 శాతం) హాజరుకాగా, 3,097 మంది గైర్హాజరైనట్టు వెల్లడించారు. ఈ నెల 20 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగనున్నాయి.