హైదరాబాద్ : పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4.97 లక్షల మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రేడ్స్ మాత్రమే కాకుండా సబ్జెక్టుల వారీగా మార్కులను వెల్లడించారు.
ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30 శాతం ఉత్తీర్ణత సాధించగా హైదరాబాద్లో అత్యల్పంగా 89.23 ఉత్తీర్ణత సాధించింది. 6 పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదయింది. బాలికల్లో 96.26 శాతం ఉత్తీర్ణత, బాలురు 94.07 ఉత్తీర్ణత సాధించారు. మార్చి 14 నుంచి మే 13వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, ఈ ఫలితాల కోసం https://www.ntnews.com, https:// telanganatoday.com వెబ్సైట్లను సంప్రదించవచ్చు.