హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ) : తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీజీ టెట్) షెడ్యూల్ గురువారం విడుదలైంది. పూర్తి వివరాలతో శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. సెకండ్ ఫేస్‌లో సర్వీసు టీచర్లకు పరీక్షలు రాసే అవకాశం కల్పించనున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జూన్‌లో నిర్వహించిన ఫస్ట్ పేస్‌లో వీరికి అవకాశం కల్పించలేదు. నవంబర్ 15 నుంచి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 2026 జనవరి 3 నుంచి 31 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో టెట్ అర్హత సాధించని 45 వేల మంది సర్వీస్ టీచర్లు పరీక్ష రాయనున్నారు. టెట్ దరఖాస్తు ఫీజు రూ. వెయ్యిగా నిర్ణయించడంతో పేద, మధ్యతరగతి అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నట్టు రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు పేర్కొన్నారు.గతంలో మాదిరిగా ఫీజును రూ. 300లకు తగ్గించాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.