హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలోగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, లేకుంటే మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్రంలో సర్పంచుల కాలవ్యవధి ముగిసి ఏడాదిన్నర కావొస్తున్నా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా స్థానిక సంస్థల పాలనను అటకెక్కించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.