హైదరాబాద్, మార్చి 2(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కు అవార్డుల పంట పడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్టు అండర్ టేకింగ్స్ (ఏఎస్ ఆర్టీయూ) ప్రతి ఏటా జాతీయస్థాయిలో అందించే అవార్డుల్లో ఐదు అవార్డులు టీఎస్ఆర్టీసీకి దక్కాయి.
2022-23 ఏడాదికిగాను రహదారి భద్రత విభాగంలో ప్రథమ బహుమతి, గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన సామర్థ్య నిర్వహణ విభాగంలో ప్రథమ, అర్బన్ విభాగంలో ద్వితీయ, సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి క్యాటగిరిలో ప్రథమ, సాంకేతికతను ఉపయోగించి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించింనందుకు ప్రథమ బహుమతి లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో అవార్డులను అందజేయనున్నట్టు ఏఎస్ఆర్టీయూ ప్రకటించింది. టీఎస్ఆర్టీసీకి ఐదు అవార్డులు దక్కడంతో మంత్రి పొన్నం హర్షం వ్యక్తం చేశారు.