హైదరాబాద్, అక్టోబర్ 7 (నమ స్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుంటే.. ప్రతిపక్షాలు కళ్లుండీ చూడలేని కబోధుల్లా వ్యవహరిస్తున్నాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేండ్లలో సీఎం కేసీఆర్ ఎన్నో అద్భుతాలు చేశారని, అందుకే రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని శనివారం ఒక ప్రకటనలో కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి కావ డం విపక్ష నాయకులు ఇష్టంలేక.. ప్రభుత్వంపై నిత్యం బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.