బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 01:58:29

‘ఉపాధి’పై కేంద్రం ప్రశంస

‘ఉపాధి’పై కేంద్రం ప్రశంస

  • నిధుల వినియోగంలో దేశంలోనే నంబర్‌వన్‌
  • గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి 

హైదరాబాద్‌, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారులు ప్రశంసించారని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రప్రభుత్వం ఇచ్చే నిధులతో సమానంగా రాష్ట్రం నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. అతితక్కువ జనాభాఉన్న పంచాయతీలకూ నెలకు కనీసం రూ.5 లక్షలు విడుదలచేస్తున్నామన్నారు. 


logo