హైదరాబాద్, మే 2(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 4వ తేదీన జరుగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందని సీఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల అంశాలు, బకాయిల చెల్లింపులు, పీఆర్సీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా పంటల కొనుగోళ్లపైనా చర్చించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా జొన్నల కొనుగోళ్లకు సంబంధించి మార్క్‌ఫెడ్‌కు బ్యాంకు గ్యారంటీకి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది. క్యాబినెట్ ఆమోదం తర్వాతే జొన్నలు కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.