హైదరాబాద్, మార్చి20 (నమస్తే తెలంగాణ): కొత్తగా తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంక్షేమ సంఘం ఏర్పాటైంది. దీనిని రాష్ట్రంలోని 12 జిల్లాల్లో కొనసాగుతున్న బీసీ స్టడీ సర్కిళ్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది ఏర్పాటుచేసుకొన్నారు.
సంఘం అధ్యక్షుడిగా చల్ల శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వసంత వాణి, గౌరవ సలహాదారుగా బీ కృష్ణారావు, జనరల్ సెక్రటరీగా మహేశ్, కోశాధికారిగా రమేశ్, జాయింట్ సెక్రెటరీలుగా ఇద్దరిని, ఈసీ మెంబర్లుగా 12 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అనంతరం వీరు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను, బీసీ స్టడీ సరిల్ డైరెక్టర్ అలోక్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.