కుల లెక్కలపై అధికారులతో అధ్యయన కమిటీ
కులగణన లెక్కలపై స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పలు అభ్యంతరాలు వ్యక్తంచేసింది. నివేదికలోని అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు కమిషన్‌లోని సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
- స్వతంత్ర కమిటీ నివేదికపై అధ్యయనం
- రాష్ట్ర బీసీ కమిషన్ నిర్ణయం
- పలు కులాల పేర్లపై తీవ్ర అభ్యంతరం
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కులగణన లెక్కలపై స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పలు అభ్యంతరాలు వ్యక్తంచేసింది. నివేదికలోని అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు కమిషన్‌లోని సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఖైరతాబాద్ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన కమిషన్ సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రటరీ బాల మా యదేవి సోమవారం భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే 2024కు సంబంధించి స్వతంత్ర నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై సమాలోచలు జరిపారు.
ఈ సందర్భంగా కమిటీ రిపోర్టులోని పలు అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నివేదికను మరింత లోతుగా విశ్లేషించేందుకు కమిషన్‌లోని సీనియర్ అధికారుల బృందంతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం కమిషన్ దృష్టిలోకి వచ్చిన అంశాలపై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. నివేదికలో గంగపుత్ర, బెస్త, గూండ్ల కులాలను సంక్షిప్త నామంగా అగ్నికుల క్షత్రియ పేరుతో వ్యవహరించడం, మరికొన్ని ఇతర కులాల విషయంలోనూ ప్రధాన కుల పేర్లకు విరుద్ధంగా పేర్కొనడాన్ని కమిషన్ అభ్యంతరం వ్యక్తంచేసింది. వాటిని సరిచేయాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

