హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. కేంద్రం తాజాగా పార్లమెంట్‌కు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 3,890 సీట్లు ఉన్నాయి. తద్వారా రాష్ట్రం దక్షిణాదిలోనే రెండోస్థానంలో నిలిచింది. తమిళనాడు 5,250 సీట్లతో మొదటి స్థానంలో నిలిచింది.
కర్ణాటకలో 3,700 సీట్లు, ఏపీలో 3,235 సీట్లు, కేరళలో 1755 సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా గణించినప్పుడు రాష్ట్రం ఏడో స్థానంలో నిలిచింది. తమిళనాడు 5,250 సీట్లతో దేశంలోనూ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మహారాష్ట్ర(5,025), యూపీ(4,3030) నిలిచాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి గణించినప్పుడు రాష్ట్రం సీట్లలో, కాలేజీల్లో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 28 ప్రభుత్వ, 28 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 3,890 సీట్లు, ప్రభుత్వ కాలేజీల్లో 4,650 సీట్లు ఉన్నాయి.