MLA Megha Reddy | హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. 6వ అంతస్తులో సీఎస్ శాంతి కుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. సీఎస్ శాంతి కుమారి వస్తున్నారు పక్కకు నిలబడండి అంటూ వనపర్తి ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు. నేను ఎమ్మెల్యేను అని చెప్పినా.. మాకు ఆదేశాలు వచ్చాయంటూ మేఘారెడ్డిని పోలీసులు పక్కకు నిలబెట్టారు. సీఎస్ వస్తే ఫ్లోర్ అంతా ఎవ్వరూ ఉండకూడదా? అని ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తు పట్టడం లేదని.. దీంతో పలుచోట్ల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
ఇవి కూడా చదవండి..
HYDRAA | హైడ్రా జీహెచ్ఎంసీలో భాగం కాదు : కమిషనర్ రంగనాథ్
Hyderabad | సాల్వో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట.. 325 ఎకరాల సర్కారు భూమి హాంఫట్
Adani | అదానీ కహానీ వెనుక భారీ కుట్ర?.. ‘సోలార్ స్కామ్’లో కొత్త కోణం..