ఆవుల్లో అద్దె గర్భం
అద్దెగర్భం (సరోగసి) విధానంలో మేలైన దేశవాళీ ఆవుదూడలను పుట్టించేందుకు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. ఈ పద్ధతిలో ఇప్పటికే రెండు ఆవులు ఈనాయని, మరో 50 ఆవులు ఈనడానికి సిద్ధంగా ఉన్నాయని యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ రవీందర్‌రెడ్డి, రిసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఏకాంబరం తెలిపారు. బుధవారం వారు యూనివర్సిటీలో మీడియాతో మాట్లాడుతూ..
- తెలంగాణ శాస్త్రవేత్తల ప్రయోగం విజయవంతం
- రెండు ఆవులకు మూడు దూడల జననం
- ఈనడానికి సిద్ధంగా మరో 50 ఆవులు
- వెటర్నరీ వర్సిటీ వీసీ రవీందర్‌రెడ్డి వెల్లడి
వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 27: అద్దెగర్భం (సరోగసి) విధానంలో మేలైన దేశవాళీ ఆవుదూడలను పుట్టించేందుకు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. ఈ పద్ధతిలో ఇప్పటికే రెండు ఆవులు ఈనాయని, మరో 50 ఆవులు ఈనడానికి సిద్ధంగా ఉన్నాయని యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ రవీందర్‌రెడ్డి, రిసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఏకాంబరం తెలిపారు. బుధవారం వారు యూనివర్సిటీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువ పాలు ఇచ్చే మేలు రకం దేశవాళీ ఆవుదూడలను పుట్టించేందుకు జగిత్యాల జిల్లా కోరుట్లలోని పశువైద్య కళాశాల కేంద్రంగా నిర్వహించిన పరిశోధనలు విజయవంతమయ్యాయని తెలిపారు.
అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆవుల అండాశయం నుంచి అండాలను సేకరించి, వాటిని అధిక పాల ఉత్పత్తి సార కలిగిన ఆంబోతుల (కోడెల) వీర్యంతో ప్రయోగశాలలో ఫలదీకరణ జరిపినట్టు చెప్పారు. ఇలా రూపుదిద్దుకొన్న పిండాన్ని ఇంక్యుబేటర్‌లో పెంచి, ఎదకు వచ్చిన ఆవుల గర్భాశయంలోకి చేర్చి తద్వారా మేలు జాతి దూడలను పుట్టించినట్టు వివరించారు. ఇలా పుట్టిన దూడలు దేశవాళీ ఆవు జాతి (సాహివాల్) లక్షణాలను కలిగి, ఒక ఈత కాలంలో దాదాపు 3 వేల లీటర్ల పాలు ఇచ్చే సామర్థ్యంతో ఉంటాయని తెలిపారు. శాస్త్రవేత్తల అవిరళ కృషికి తోడుగా ప్రభుత్వం పశు సంపదకు ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. పశు వైద్య కళాశాల పునరుత్పత్తి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు చేసినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Cattle
- Cow
- Scientists
- successfully
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

