కరీంనగర్ : తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల బృందం గురువారం కరీంనగర్ పట్టణంలో పర్యటించింది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ను తమిళనాడు ఎమ్మెల్యేలు సింతనాయి సెల్వన్, ఎస్ఎస్ బాలాజీ తో పాటు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డాక్టర్ రిచర్డ్ డెవడస్, మురుగప్పన్, డాక్టర్ వీఏ రమేశ్ నాథన్ తదితరులు కలిశారు.
తెలంగాణలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. దళితబంధు, ఎస్సీ సబ్ ప్లాన్ పథకాలపై అవగాహన కోసం తెలంగాణలో పర్యటిస్తున్నామని మంత్రికి వివరించారు. దళిత బంధు గురించి సంపూర్ణ సమాచారాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యేలు దళిత సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.
ప్రభుత్వ పథకాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రిని వారు అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేల బృంధం చొప్పదండి మండలం రుక్మపూర్ లోని సైనిక స్కూల్‌ను సందర్శించింది. వారి వెంట రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులున్నారు.