హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): వరంగల్‌లోని మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి 280.3 ఎకరాల భూసేకరణకు మొదట నిర్ణయించింది. ఈ ఏడాది జూలైలో రూ.205 కోట్లు విడుదల చేసింది.
మరో రూ. 90కోట్లు కేటాయించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదన పం పారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. 6ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయాలని నిరుడు బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్రం మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను మంజూరు చేసింది.