హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : ఇటీవల ‘తెలంగాణ రైజింగ్’ అంటూ ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తాజాగా ‘తెలంగాణ రైజింగ్-2047’ అంటూ మరో కొత్త ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ విధంగా రోజుకో కొత్త నినాదం, కాలానుగుణంగా కొత్త దిశ మార్చుతున్నారని, కానీ, ఏదీ కార్యరూపం దాల్చలేదని గురువారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.
రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న తుగ్లక్ తరహా విధానాలు తెలంగాణను వెనక్కి నెట్టాయని విమర్శించారు. ఇది పురోగతి కాదని, తిరోగమనం అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ చెప్తున్న ‘వికసిత్ భారత్-2047’ నినాదాన్ని అనుకరిస్తూ.. త్రివర్ణ పతాకం నుంచి కాషాయరంగుకు చిహ్నంగా మారడం సందేహాలను లేవనెత్తుతున్నదని పేర్కొన్నారు.