హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు రాష్ట్రంలో భూసంస్కరణలను అమలు చేసిన సంఘసంస్కర్త అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార కొనియాడారు. పీవీ జయంతి సందర్భంగా శనివారం నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్ వద్ద భట్టి నివాళులర్పించారు. పీవీ మన రాష్ట్రంలో జన్మించడం మనకందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. అదే విధంగా దివంగత పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రజాభవన్‌లో ఆయన చిత్రపటానికి మంత్రి సీతక నివాళులు అర్పించారు.
స్థానికంగా లభించే వస్తువులు, ఉత్పత్తులతో మహిళా సంఘాలతో పరిశ్రమ లు ఏర్పాటు చేయించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సీతక అధికారులను ఆదేశించారు. ఇటీవలే సెర్ప్ అడిషనల్ సీఈవోగా నియమితులైన కాత్యాయనీదేవి సచివాలయంలో శనివారం సీతకను కలిశారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.