Lok Sabha Elections | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. అన్ని నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు ఉత్సాహంతో ఓటు వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 69.81 శాతం, భువనగిరిలో 72.34 శాతం, చేవెళ్లలో 53.15 శాతం, హైదరాబాద్‌లో 39.17 శాతం, కరీంనగర్లో 67.67 శాతం, ఖమ్మంలో 70.76 శాతం, మహబూబాబాద్‌లో 68.60 శాతం, మహబూబ్‌నగర్‌లో 68.40 శాతం, మల్కాజ్‌గిరిలో 46.27 శాతం, మెదక్‌లో 71.33 శాతం, నాగర్‌కర్నూల్‌లో 66.53 శాతం, నల్లగొండలో 70.36 శాతం, నిజామాబాద్‌లో 67.96 శాతం, పెద్దపల్లిలో 63.86 శాతం, సికింద్రాబాద్‌లో 42.48 శాతం, వరంగల్‌లో 64.08 శాతం, జహీరాబాద్‌లో 71.91 శాతం పోలింగ్ నమోదైంది.