మొదటి, రెండో కరోనా వేవ్‌లలో అనేక నగరాల్లో ఇండ్ల డిమాండ్ తగ్గినప్పటికీ ఇండ్ల ధరలు పడిపోలేదని పార్లమెంటుకు సోమవారం సమర్పించిన ఆర్థిక సర్వే తెలిపింది. కొన్ని నగరాల్లో పెరగడమూ జరిగిందని వివరించింది. రెండు వేవ్‌ల తర్వాత నిద్రాణంగా ఉన్న డిమాండ్ గృహరుణాలపై తక్కువ వడ్డీ, కొన్ని రాష్ర్టాల్లో స్టాంప్ డ్యూటీ తగ్గింపు వంటి కారణాల వల్ల ఎగిసిపడిందని పేర్కొన్నది. జాతీయ హౌజింగ్ బ్యాంకు డాటాను సర్వే విశ్లేషించింది. కొవిడ్ కుదుపుల సందర్భంగా లావాదేవీలు తగ్గి ఉండొచ్చు గానీ, ఎంపిక చేసిన అనేక నగరాల్లో ధరలు తగ్గలేదని, కొన్ని నగరాల్లో పెరిగాయని వెల్లడించింది.