హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సొంత రాబడుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.30,914 తలసరి సొంత రాబడితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతోనే ఇది సాధ్యమైంది.
ఈ జాబితాలో బీజేపీ పాలిత రాష్ర్టాలన్నీ తెలంగాణ తర్వాతే ఉన్నాయి. రూ.29,082 తలసరి రాబడితో హర్యానా రెండో స్థానంలో నిలువగా.. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రూ.19,835తో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నది. గుజరాత్ కంటే తెలంగాణ తలసరి రాబడి ఏకంగా రూ.11,079 ఎక్కువ. మోదీ ప్రాతినిధ్య రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేదు. తలసరి సొంత రాబడుల్లో ఆ రాష్ట్రం 17వ స్థానానికి పరిమితమైంది.