హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యతన 24న పీసీసీ కమిటీల సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం, అనంతరం పీసీసీ సలహా కమిటీ సమావేశం జరుగుతాయి.
మధ్యాహ్నం తర్వాత నూతనంగా ని యమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశాలు జరుగుతాయని, ఈ సందర్భంగా వారికి నియామక పత్రాలు అందజేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పాల్గొంటారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.