హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ ‘సిందూర్’ పేరుతో సోషల్ మీడియాలో అప్డేట్స్ వెతుకుతున్నారా? ఆ పేరుతో కనపడిన లింక్స్‌ను క్లిక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక అకౌంట్లనే ఫాలో కావాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. ఆపరేషన్ ‘సిందూర్’ పేరిట సైబర్ నేరగాళ్లు పిషింగ్ లింకులను పోస్టు చేసి, అమాయకులకు వల విసురుతున్నారని చెప్తున్నారు.