నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ (ఈపీఐ-2021)లో అత్యుత్తమ వాణిజ్య వ్యాపార మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. అత్యధిక వస్తు సేవలు ఎగుమతి చేస్తున్న టాప్-5 రాష్ట్రాల్లో తెలంగాణ చోటు సంపాదించిందని నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
కాగా, ఈ విషయంపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. “ తెలంగాణ ఉత్తమ వ్యాపార వాతావరణాన్ని అందిస్తుందని నీతి ఆయోగ్ చెప్పింది” అని ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని మంత్రి తన ట్వీట్‌కు జోడించారు.
Telangana offers best business climate, says Niti Aayog- The New Indian Express https://t.co/V8cLYDnrjh
— KTR (@KTRTRS) March 26, 2022