హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ వెబ్సైట్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం రాజ్భవన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వెబ్సైట్ ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గవర్నర్ సెక్రటరీ దానకిషోర్ పాల్గొన్నారు.