బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 20:31:44

తెలంగాణ రౌండ‌ప్‌..

తెలంగాణ రౌండ‌ప్‌..

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట‌వ్యాప్తంగా గురువారం చోటుచేసుకున్న ప‌లు వార్తావిశేషాల స‌మాహారం.


జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈసీ వేర్వేరుగా సమావేశమైది. వార్డుల వారీగా ఓటరు జాబితా తయారీ, పోలింగ్‌ కేంద్రాల ఖరారు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల వ్యయం తదితర అంశాలపై ఆయా పార్టీల నేతలతో చర్చించింది. మ‌రింత స‌మాచారం కొర‌కు..


గత ఆరున్నర ఏండ్లలో  రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి విద్వేషాలు లేకుండా మత సామరస్యంగా పాలన సాగుతున్నది. అలాంటి కేసీఆర్‌ను బలహీన పర్చాలనే కుట్ర జరుగుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


రైతులను సంఘటితం చేసే లక్ష్యంతోనే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా సంగెం మండలంలోని తీగరాజుపల్లి, గావిచెర్ల గ్రామాల్లో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్మాణ వ్యర్థాలు తరలించే ఆధునిక (కాంప్యాక్టర్‌) స్వచ్ఛ వాహనాలను, సంజీవయ్యపార్కు వద్ద ఆధునిక చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్డు వద్ద మంత్రి కేటీఆర్ జెండా ఊపి స్వచ్ఛ వాహనాలను ప్రారంభించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


అటవీ శాఖను మరింత బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా అటవీ శాఖ (డీఎఫ్ వో) కార్యాలయాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  ప్రారంభించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


రాష్ర్టంలో ఇంజినీరింగ్ ప్ర‌వేశాల కౌన్సెలింగ్ పూర్తయింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు చివ‌రి విడుత సీట్ల కేటాయింపు పూర్త‌యిన‌ట్లు ఎంసెట్ క‌న్వీన‌ర్ ప్ర‌క‌టించారు. రాష్ర్టంలో 181 కాలేజీల్లో 50,884 సీట్లు భ‌ర్తీ కాగా, క‌న్వీన‌ర్ కోటాలో ఇంకా 19,726 సీట్లు మిగిలాయి. 12 యూనివ‌ర్సిటీలు, 26 ప్ర‌యివేటు కాలేజీల్లో ఇంజినీరింగ్ సీట్లు భ‌ర్తీ అయ్యాయి. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


రైతులకు మద్దతు ధర దక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. వర్ధన్నపేట మండలంలోని రాందన్ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


స్టాఫ్‌ నర్సు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, తెలంగాణ వైద్య విద్య విధాన పరిషత్‌లో స్టాఫ్‌ నర్సుల నియామకానికి 3 నవంబర్‌,2018న పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలం ఇడికుడ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి విఘ్నేష్ పెద్దపులి దాడిలో మృతి చెందిన సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేశారు. మ‌రింత స‌మాచారం కొర‌కు.. 


ఉద్యోగావకాశాల కోసం ఏర్పాటు చేసిన పోలీస్ శిక్షణ కేంద్రాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మ‌రింత స‌మాచారం కొర‌కు..