ఆదిలాబాద్ నెట్వర్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పొలాల అమావాస్య పండుగను రైతులు నిర్వహించారు. ఎడ్ల కొమ్ములకు రంగులు దిద్ది, కాళ్లకు గజ్జెలు కట్టి అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాల్లోని ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. పిండి వంటలను ఎడ్లకు తినిపించారు. పలు గ్రామాల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడలో ఎమ్మెల్యే జోగు రామన్న దంపతులు ఎడ్లకు పూజ చేశారు.